
పయనించే సూర్యుడు డిసెంబర్11 అన్నమయ్య జిల్లా
టి సుండుపల్లి మండలంటిడిపి రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు , టిడిపి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు చొరవతో సొంత నిధులతో హిందు స్మశాన వాటికు మరమ్మత్తులు చేయించారు. ఏళ్ల తరబడి కంపచెట్లతో పిచ్చి మొక్కలతో ఉన్న స్మశాన వాటికకు చప్పిడి సోదరులు మరమ్మతులు చేయించడం వలన సుండుపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, జగదీష్ స్వామి టిడిపి నాయకులు చంద్రశేఖర్ రాజు,సిద్దయ్య, మస్తాన్, పాపరాజు, వెంకటేష్,టిడిపి యువ నాయకులు మనోజ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.