
పయనించే సూర్యుడు న్యూస్ :హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. కారు శామీర్‌పేట నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తుంగా ప్రమాదం జరిగింది. శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధమైన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. డ్రైవర్ హీటర్ ఆన్ చేసుకుని పడుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హీటర్ ఎక్కువసేపు ఆన్‌లో ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని… డ్రైవర్ నిద్రలేచి డోర్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించినా అవి తెరుచుకోకపోవడంతో సజీవదహనం అయ్యాడని చెబుతున్నారు పోలీసులు. శామీర్‌పేట నుంచి కీసర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మంటల్లో సజీవ దహనమైన డ్రైవర్ హనుమకొండ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు.