-ప్రభుత్వ హామీల పై నిలదీయాలి..
-రాబోయే ఎన్నికల్లో మీ అందరిని గెలిపించుకుంటా..
-త్వరలో నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం..
-మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
పయనించే సూర్యడు // ఫిబ్రవరి // 28 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. హుజరాబాద్ నియోజకవర్గానికి నేను ఒక్కడినే ఎమ్మెల్యేని కాదని, తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు కష్టపడిన ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేనేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ కెసి క్యాంపు లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారిని ఉద్దేశించి మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా పోరాడుతూనే ఉంటానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్,చేస్తూ వారిని నిలదీస్తే తనపై కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదే లేదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజల ముందు ఉంచేందుకు ప్రతి ఒక్కరు చర్చ జరపాలన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కూడా ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే మార్చి 10వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో వివిధ కమిటీలు వేయాలని అన్నారు. ఇక నుంచి రాబోయే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని, పోటీ చేసే వారి ముందుండి గెలిపించుకునే బాధ్యత తనదని అన్నారు. నియోజకవర్గంలోని ఏ కార్యకర్త అధైర్య పడవద్దని, ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా ఉంటానని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదిస్తే వారికి న్యాయం జరిగేలా చూసుకుంటానని అన్నారు. కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తనను ఫోన్లో సంప్రదిస్తే వారి సమస్యను పరిష్కరించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలందరిని కలుపుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తానని అన్నారు. మండలంలోని కాట్రపల్లి, చిన్నపాపయ్యపల్లి, పెద్దపాపయ్యపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లి, కనుకులగిద్ద, జూపాక బొత్తలపల్లి, రాంపూర్, రంగాపూర్, సిర్సపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట, సింగాపూర్, మాందాటిపల్లి, తుమ్మనపల్లి, రాజపలల్లి, చెల్పూర్, శాలపల్లి - ఇందిరానగర్ వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.