పయనించే సూర్యడు // ఫిబ్రవరి // 27 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఉన్న, ఏరియా ఆసుపత్రికి చాలామంది రోగులు రావడం జరుగుతుంది. ఈ సందర్బంలో,ఏరియా ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు పంపిస్తున్నారని ఆరోపణల మేరకు వారం రోజుల క్రితం విచారణ జరిపిన డీఎంహెచ్‌వో వెంకటరమణ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. 108లో పనిచేసే ఓ ఉద్యోగి ఏరియా ఆస్పత్రి ఎదుటనే మూడు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసుకొని సెక్యూరిటీ గార్డ్స్, శానిటేషన్ సిబ్బందికి కమీషన్లు ఇచ్చి వారి సహాయంతో ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. కలెక్టర్ వారిని తొలగించాలని ఆదేశించడంతో 15 మంది సిబ్బందిని తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఇందులో సెక్యూరిటీగార్డ్స్ ఏడు మంది, సానిటేషన్ సిబ్బంది ఎనిమిది మంది ఉన్నారు.