▪ఆడైర్యా పడొద్దు..కౌన్సిలర్లు గా గెలిపించుకునే బాధ్యత నాదే..
▪పాడి కౌశిక్ రెడ్డి..(ఏంమ్మెల్యే )
పయనించే సూర్యుడు //జనవరి //26//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్...
ప్రతి ఒక్కరిని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిపించుకునే బాధ్యత నాది ఎవరు అధైర్య పడవద్దు అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కౌన్సిలర్ అందర్నీ సన్మానించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఐదు సంవత్సరాల్లో కౌన్సిలర్లు వార్డుల అభివృద్ధికి ఎంతో గాను కృషి చేశారని కొనియాడారు. రాజకీయ నాయకుడికి పదవి విరమణ అనేది ఉండదని ప్రజాతో సత్సంబంధాలు ఎప్పటికీ ఉంటాయన్నారు.ప్రజా సమస్యలపై ఎప్పుడు స్పందిస్తానని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడానికి కృషి చేసిన కౌన్సిలర్లను గెలిపించుకోవడం నా బాధ్యత అని తెలిపాడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందు ఉంటానని అన్నారు. రాబోయే ఎన్నికల వరకు ప్రజల మధ్యలోనే ఉంటూ వారి అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందెరాధిక- శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ కొలిపాక నిర్మల -శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యం రాజు, తోట రాజేంద్రప్రసాద్, సదానందం, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కిషన్, ఉమామహేశ్వర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.