పయనించే సూర్యడు // మార్చ్ // 18 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన పాటి మీద ఆంజనేయస్వామి వారి ఆలయానికి భక్తులు భక్తిశ్రద్ధలతో విరాళాలు అందిస్తున్నారు. మంగళవారం నాడు ముసుకు సుష్మిత - శ్రీకాంత్ రెడ్డి ( ఎన్ఆర్ఐ ) దంపతులు రూ. 20,000 విలువైన దీపపు చెమ్మలను స్వామి వారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, విరాళం అందించిన కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ…భక్తుల సహాయ సహకారాలు దేవస్థానం అభివృద్ధికి తోడ్పడతాయని, మరింత మంది భక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 5 వార్డ్ మాజీ కౌన్సిలర్ అపరాధ ముత్యం రాజు మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గందే శ్రీనివాస్ పాల్గొన్నారు.