6 గ్యారంటీల పైన మాట్లాడిన ఎమ్మెల్యే..
పింఛన్లపై గొంతు లేపిన కౌశిక్ రెడ్డి..
జనం న్యూస్ //జనవరి 11//జమ్మికుంట //కుమార్ యాదవ్..
హుజురాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో హుజురాబాద్ మండలం మరియు పట్టణ 169 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ప్రతి ఒక్క లబ్ధిదారునికి చెక్కులు అందజేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..169 మంది లబ్ధిదారులకి తులం బంగారం కూడా ఇవ్వాలి,ఇస్తా అని మోసం చేసావ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం రైతులకు సాగునీటి కోసం కాలువ నీళ్లు రావాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి నిన్ను ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు పెడుతావా అని ప్రశ్నించారు.నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల కోసం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం అన్నారు.తెలంగాణ ప్రజల తరఫున ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తుంటే, నాపై అక్రమ కేసులు వేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి కి ఇదే మా ప్రశ్నఅన్నారు.గెలవక ముందు “ఓడ మల్లన్న”, గెలిచిన తర్వాత “బోడ మల్లన్న”గా మారిపోయావు అని ఎద్దేవా చేశారు.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500 ఇస్తామన్నారు. ఎక్కడికి పోయిందన్నారు.రైతులకు ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల ఋణమాఫీ చేస్తామన్నారు. దానికి ఏమైందన్నారు.రైతులకు ఎకరానికి రూ. 15,000 ఇచ్చే “రైతు భరోసా” ఎక్కడ ఉంది అని మాట్లడారు.కల్యాణలక్ష్మి తులం బంగారం మాటలు ఎక్కడికి పోయాయన్నారు.అవ్వతాతలకు రూ. 4,000 పింఛన్ ఏం అయింది అని అన్నారు.వికలాంగులకు 6,000 పించన్ హామీ ఏమైంది, అంటూ
చేయూత పథకం పేరుతో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడన్నారు.
దళితబంధు కింద ప్రతి దళితుడికి రూ. 12 లక్షలు ఇస్తామని మాటలు చెబుతూనే ఉన్నారు ఇవ్వట్లేదు అని తెలిపారు.ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తామన్న హామీ కేవలం గాలి మాటలు చెప్తున్నారన్నారు.
మీ దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకివచ్చి,విర్రవీగుతున్నావన్నారు. ఆ మాటలు నమ్మి ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి అందులో,54 రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు, అని 89 ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. 29 చేనేత కార్మికులు బలవన్మరణం పాలయ్యారన్నారు.450 కంటే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. 140 పైగా లైంగిక దాడి ఘటనలు జరిగాయి,390 కంటే ఎక్కువ నిరసనలు వెలువడ్డాయి, 300 కంటే ఎక్కువ మంది కుక్కల దాడులకు బలయ్యారని వివరించారు.1085 మంది విద్యార్థులు ఆహార విషపూతకు గురై ఆసుపత్రుల్లో చేరారని,
ఇన్ని సమస్యల మధ్య మీరు బాధితులను ఒక్కసారి అయినా కలిసారా? వారి గోడు విన్నారా?అని ప్రశ్నించారు.ఆరు గ్యారంటీల పేరుతో లెక్కలు చెప్పడం కాదు రేవంత్ రెడ్డి, ప్రజల గుండెల్లో నిలవడం నేర్చుకోండి, అని మండిపడ్డారు.నువ్వు ఎన్ని కేసులు పెట్టిన నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం అని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మునిసిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి ,జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్,హుజరాబాద్ మాజీ జెడ్పిటిసి బక్కారెడ్డి,హుజురాబాద్ మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ బండి రమేష్,హుజురాబాద్ పట్టణ కౌన్సిలర్లు రమాదేవి, సుశీల,తపతిర్మల్,ఆపరాజ ముత్యం రాజు, రమేష్ కిషన్ రెడ్డి,కుమార్,పూర్ణచందర్ హుజురాబాద్ మండల నాయకులు మాజీ సర్పంచులు ప్రతాపరెడ్డి,కిరణ్,కొండల్ రెడ్డి,వెంకటేష్, సతీష్,శ్రీనివాస్ ఇతరుల నాయకులు పాల్గొన్నారు.