పయనించే సూర్యడు // మార్చ్ // 15 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా,,విశారధన్ మహారాజ్, ఆదేశానుసారం హుజురాబాదులోని సిర్సపల్లి క్రాస్ కాన్షిరం విగ్రహ స్థలం వద్ద మండల కన్వీనర్ మంద రాజ్ మహారాజ్ ఆధ్వర్యంలో బహుజన నాయకుడు సామాజికవేత్త మాన్యశ్రీ కాన్సిరాం జయంతి మరియు ధర్మ సమాజ్ పార్టీ రెండవ ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది,, ఈ సందర్భంగా మంద రాజు మహారాజు మాట్లాడుతూ తెలంగాణ పీడిత ప్రజలు పడుతున్న అంతులేని దుఃఖానికి ముగింపు పలకాలంటే కాన్షీరామ్ ఖడ్గం తో యుద్ధం చేయాల్సిందేనని అప్పుడే అమ్ముడుపోని, బి సి, ఎస్ సి ,ఎస్టీ సమాజం నిర్మాణం అవుతుంది, అన్నారు. నిజాయితీ నేతలు పైకి వస్తారు,అని కాన్షిరం పోరాటం స్మరించుకుందాం , అని తెలిపారు.తెలంగాణలో కాన్షీరామ్ యుద్ధాన్ని కొనసాగిద్దాం అని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు కండె తిరుపతి, సందెల వెంకన్న, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, వేల్పుల రత్నం తునికి సమ్మయ్య ,సొల్లు బాబు, పంజాల రామశంకర్ గౌడ్, సతీష్ గౌడ్ అచ్యుత్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.