అధ్యక్షుడిగా హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా మతిన్, ఉపాధ్యక్షుడిగా యాదగిరి ఎన్నిక..
పయనించే సూర్యడు, మే 19, కుమార్ యాదవ్, హుజురాబాద్ అర్ సి)
హుజురాబాద్ వాకర్ అసోసియేషన్ ఎన్నికలకు, ఎన్నికల అధికారులు రెండు బూత్ లు ఏర్పాటు చేయాగ, మొత్తం 926 ఓటర్లకు 607 ఓట్లు పోలయ్యాయి. పోలీస్ బందోబస్త్ మధ్య ఎన్నికలు స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో, పోటాపోటీగా జరగగా ఎట్టకేలకు ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో నూతన పాలకవర్గం కోలువు తీరింది. ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ముగ్గురు ఈసీ మెంబర్లకు ఉదయం నుంచి 11 గంటల వరకు నిర్వహించగా, మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడయ్యాయి. అధ్యక్షుడిగా కొమురవెల్లి హరిప్రసాద్, ఉపాధ్యక్షుడుగా మండల యాదగిరి, కోశాధికారిగా చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, గతంలోనే ఏకగ్రీవం కావడంతో ఉత్కంఠగా సాగాల్సిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ప్రధాన కార్యదర్శికి మక్కపల్లి రమేష్(230), బుర్ర కుమార్(97), మం ఏ మతీన్(250) పోలవగా మతిన్ 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శిగా కుడికల ప్రభాకర్(290), కోట సంపత్(306) ఓట్లు రాగా నోటాకు 11 పోలయ్యాయి. 16 ఓట్ల మెజార్టీతో కోట సంపత్ గెలుపొందారు. అలాగే ఈసీ మెంబర్లుగా కుడికాల ప్రభాకర్(311), కoదల రమేష్(438), ముషం రాజేంద్రము(473), తేలుకుంట్ల వేణు(347) ఓట్లు పోలయ్యాయి. దీంతో ముగ్గురు గెలుపొందగా తక్కువ ఓట్లు వచ్చిన ప్రభాకర్ ఓడిపోయారు. ఈ పదవులకు పోటాపోటీగా ఓట్లు రావడంతో కౌంటింగ్ ముగిసేంతవరకు ఉత్కంఠ నెలకొంది. వారం రోజుల ఉత్కంఠకు నూతన పాలకవర్గం ఎన్నికతో ముగింపు పలికినట్లు అయింది. అధ్యక్షుడుగా కొమురవెల్లి హరిప్రసాద్, ఉపాధ్యక్షుడిగా మండల యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా ఎంఏ మతిన్, కోశాధికారిగా చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కోట సంపత్, డైరెక్టర్లుగా ముషము రాజేంద్రము, కందల రమేష్, తేలుకుంట్ల వేణుల ఎన్నికతో వాకర అసోసియేషన్ నూతన పాలకవర్గం పూర్తిస్థాయిలో ఏర్పాటయింది. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల నిర్వహణ కమిటీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఇలాసాగరం వీరస్వామి, ఇతర ఎన్నికల అధికారులు గెలుపు పత్రాలను అందజేశారు.