
పయనించే సూర్యుడు నవంబర్ 26 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
ఈరోజు తిరుపతి జిల్లా లేప్రోసి, ఎయిడ్స్ మరియు టిబి నివారణ అధికారి వారి కార్యాలయం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు హెచ్.ఐ.వి. ప్రభావిత పిల్లల అవసరాల పై వివిధ శాఖల సిబ్బందితో సమన్వయ సమావేశం జిల్లా వైద్యాధికారి డా.బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు జిల్లా లేప్రసి ఎయిడ్స్ మరియు టీబి అధికారి, డా. పి . శైలజ తెలియజేసారు.
జిల్లా లేప్రసి ఎయిడ్స్ మరియు టీబి అధికారి మాట్లాడుతూ హెచ్.ఐ.వి. ప్రభావిత పిల్లలు మరియు వారి కుటుంభ సభ్యులు, స్వచ్చంద సంస్థలు మరియు విధ్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖవారితో సమన్వయ సమావేశము ఏర్పాటు చేయడమైనది. హెచ్.ఐ.వి. ప్రభావిత పిల్లలు అవసారాలు మరియు ఎదుర్కొటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాలన లక్ష్యంతో హెచ్.ఐ.వి. ప్రభావిత పిల్లలతో ఈ సమావేశము నిర్వహించారు. ప్రభావిత రోగులు తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలను అడిగి తెలుసుకున్నారు. హెచ్.ఐ.వి. ప్రభావిత పిల్లలు ఏ.ఆర్.టి మందులను సక్రమంగా తీసుకుంటూ, పౌష్టికాహారం తీసుకోవాలని తద్వారా ఆరోగ్యం మేరుగుపరుచుకోవచ్చని అన్నారు.జిల్లా పరిధిలో ఉన్న మండలములలో హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న మరియు హెచ్.ఐ.వి. ప్రభావితమైన 14 నుండి 25 సంవత్సరాల వయస్సు గల పిల్లలతో సమస్యలు మరియు అవసరాలు గుర్తింపు మరియు పరిష్కారానికి అవసరమైన చర్యల గురించి జిల్లా స్థాయి హెచ్.ఐ.వి./ఎయిడ్స్ ఎస్.వి.డి.ఎస్ స్వచ్చంద సేవా సంస్ధ మరియు నెట్ వర్క్ సిబ్బంది కూడా భాగస్వామ్యం చేసి అవగాహన కార్యాక్రమాలు నిర్వహించేల చర్యలు తీసుకోవాలని సూచించడమైనది. ఇతర స్వచ్చంద సేవా సంస్ధలు ముందుకు వచ్చి హెచ్.ఐ.వి./ఎయిడ్స్ కార్యాక్రమాలపై జిల్లా వ్యాప్తంగా విసృతంగా అవగాహన కలిపించాలని కోరారు.అనంతరం పలు చిన్నారులకు పౌష్టికాహారం అందించారు.ఈ కార్యక్రమమునకు, జిల్లా లేప్రసీ, ఎయిడ్స్ మరియు టి.బి. అధికారి, డా. శైలజ , art నోడల్ ఆఫీసర్ డా. మల్లీశ్వరి , జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్ధ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కోటిరెడ్డి, సురేంద్ర, మంజునాథ్ , రమేష్ మరియు పలు స్వచ్చంద సేవా సంస్ధ సిబ్బంది పాల్గొన్నారు.
