
పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు బి.గోపాలం
:పయనించే సూర్యుడు జులై 14మక్తల్: మక్తల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అధ్యక్షుడు బి. గోపాలం అధ్యక్షతన సోమవారం పెన్షనర్స్ సంఘం సమావేశం నిర్వహించారు,తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ కు హెల్త్ కార్డులు జారీ చేయకుండానే, విధివిధానాలను రూపొందించకుండానే మే నెల, జూన్ నెల జీతం లో ఒకటి పాయింట్(1.5%) ఐదు శాతం డబ్బులు కట్ చేసుకోవడం దారుణం అని దీనిని వ్యతిరేకిస్తున్నామని మక్తల్ పెన్షనర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి.గోపాలం, బి భాస్కర్ తెలిపారు. 1.5% మినాయించడం పెన్షనర్స్ అందరూ ఆందోళనకు గురి అయ్యారని, ఇది న్యాయం కాదని, వెంటనే వెనక్కి తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. . అసలు పెన్షనర్స్ నుండి హెల్త్ కార్డుల కొరకు ఒకటి పాయింట్ ఐదు శాతం వినయింపు ఇవ్వాలి, వసూలు చేయరాదని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈనెల 15న అందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని, ప్రాథమిక హక్కులో భాగంగా పెన్షనర్స్ కు అందాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందక చాలా మంది మరణించారని ఈ మరణాలకు ప్రభుత్వమే కారణమని తెలిపారు. 2023 నుండి పెండింగ్లో ఉన్న డి ఎ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని, ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ పి ఆర్ సి ని రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ప్రకటించాలని వాడు కోరినారు.ఈమధ్య ప్రభుత్వ ప్రచారము:- బ్యాంకుల ద్వారా పెన్షనర్స్ కు ప్రమాద బీమా పథకాలను ప్రకటించాయి. సాధారణంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే వేతనాన్ని బట్టి రూ. 30 లక్షల నుండి కోటి వరకు పరిహారం ఇస్తామని బ్యాంకులు వెల్లడించాయి. ఈ బీమా సౌకర్యాలు బ్యాంకులు ఖాతాదారులను ఆకర్షించడానికి మాత్రమే, బతికున్నప్పుడు రాని బకాయిలు సచ్చాక వచ్చే కోట్లు ఎవరికీ కావాలి, ఇది ఎలాంటి న్యాయం, ప్రస్తుత ఆర్థిక అవసరాల కోసం, పిల్లల చదువులు, వైద్య ఖర్చులకోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం పెన్షనర్స్ అప్పుల పాలవుతుంటే, ప్రభుత్వము మీరు చనిపోతే కోట్లు వస్తాయి అనడం పెన్షనర్స్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే, పెన్షనర్స్ న్యాయం అయిన డిమాండ్ల నూతన పిఆర్సి అమలు, పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేసి ,వారి కుటుంబాలకు భద్రత, భరోసా కల్పిస్తారని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ఇంకో విషయం ప్రస్తుతం పని చేయుచున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామని క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వము ప్రకటించడం విడ్డూరంగా ఉంది, ఉపాధ్యాయులు అడిగారా, అడుగుచున్నవి ఇవ్వాల్సిన డి ఏ లను, నూతన పిఆర్సిని వెంటనే ప్రకటిస్తే అందరూ సంతోషిస్తారని, పెన్షనర్స్ అందరూ ఈ నెల 31 లోపల ఐటి ఈ ఫైలింగ్ చేసుకోవాలని, ఎస్ టి ఓ లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని అధ్యక్ష కార్యదర్శులు బి.గోపాలం, బి.. భాస్కర్ తెలిపారు. ఈ నెలలో సూర్య ప్రకాష్, లక్ష్మీకాంత్ రెడ్డి, తిప్పారెడ్డి, యశోద ల పుట్టినరోజు సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బి .సంజన ,సూర్య ప్రకాష్, సిద్ధిలింగయ్య ,తులసప్ప, అరుణ ,విద్యావతి, సుజాత, యశోద, శ్రీనివాస్ రెడ్డి, రాములు, నారాయణరెడ్డి ,సిద్ధిరాములు, నరసింహులు గౌడ్, ఈశ్వరయ్య, తిప్పారెడ్డి, లక్ష్మీ కాంత్ రెడ్డి, జి. సురేందర్, సత్యనారాయణ ,బసవరాజ్, జనార్ధన్, అశోక్ గౌడ్, ఎల్లప్ప, మమ్మద్ హుస్సేన్, ఖదీర్ , రామచందర్ ,ఆశన్న, రమేష్, 80 మంది సభ్యులు పాల్గొన్నారు.