పయనించే సూర్యుడు న్యూస్ రాజంపేట జనవరి 31: మండల పరిధిలోని జ్యోతి కాలనీ వాసులకు శుక్రవారం హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా అద్దాలు అవసరమైన వారికి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందని ఆ సంస్థ వ్యవస్థాపకులు పలుకూరి వెంకటరమణ తెలియజేశారు. సేవా కార్యక్రమాలలో తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులు శివాజీ, మణి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : కంటి అద్దాలు పంపిణీ చేస్తున్న పలుకూరి వెంకటరమణ