
పయనించే సూర్యుడు డిసెంబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా నంద్యాల ట్రాఫిక్ సీఐ చాన్ బాష ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్ధర్మాన్ని మంగళవారం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించకూడదని ట్రాఫిక్ సీఐ చాన్ బాష సూచించారు.అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ట్రాఫిక్ సీఐ చాన్ బాష తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.