
పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఎస్పీ రాహుల్ మీనా..జీవితం చాలా విలువైనది. అటువంటి జీవితానికి భద్ద్రత అవసరం అని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. హెల్మట్ అవసరం అందరూ గుర్తించాలి అంటూ ఎస్పీ స్వయంగా మోటార్ సైకిల్ నడుపుతూ అవగాహనా చేశారు. అమలాపురం డిఎస్పీ కార్యాలయం నుంచి గడియార స్థంభం సెంటర్, నల్లవంతెన, ఎర్ర వంతెన, మహిపాల వీధి, హై స్కూల్ సెంటర్ మీదుగా బైక్ ర్యాలీ గడియార స్థంభం సెంటర్ కు చేరుకున్నారు. రహదారి భద్రత అందరి బాధ్యత అని ఎస్పీ వాహన దారులను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ఆక్సిడెంట్ లు కేవలం తలకు దెబ్బ తగలడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని రాహుల్ మీనా అన్నారు. ఆడిషనల్ ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యత గా హెల్మెట్ ధరిస్తే ఆయా కుటుంబాలు జీవితం నందన మయం అవుతుందన్నారు. అనంతరం వాహన దారులు తో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఆర్ టి ఒ దేవుశెట్టి. శ్రీనివాస్, డిఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్,ఏ ఆర్ డి ఎస్పీ సుబ్బరాజు, పట్టణ సీఐ పి వీరబాబు, పట్టణ ఎస్ ఐ కిషోర్ బాబు, ట్రాఫిక్ ఎస్ ఐ యేసు బాబు తదితరులు పాల్గొన్నారు.
