పయనించే సూర్యుడు న్యూస్ మే 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. మే 10వతేదీ నుంచి 31వతేదీ వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 72 వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ముస్తాబు అయింది.హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణుల రాక ప్రారం భమైంది.మిస్ కెనడాకు సంప్రదాయ స్వాగతం శనివారం రాత్రి మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు.మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల సుందరాంగులు ఈ నెల 6 వ తేదీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. శంషా బాద్ విమానాశ్రయానికి చేరుకున్న మిస్ కెనడా కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు.కెనడా దేశ గొప్ప స్వదేశీ వారసత్వాన్ని సూచించే మిస్ కెనడా ఎమ్మా మోరి సన్ కు ప్రపంచ సౌందర్యం, స్థానిక సంప్రదాయాల కలయికను ప్రదర్శించే శాస్త్రీయ నృత్యంతో స్వాగతం పలికారు.హైదరాబాద్ లో మిస్ వరల్డ్ అధికారుల మకాంమిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే వివిధ దేశాల అధికారులు హైదరాబాద్ లో మకాం వేసి మిస్ వరల్డ్ 2025 కోసం ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. హైదరాబాద్లో జరగనున్న ప్రతిస్ఠాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీల సన్నాహాల్లో భాగంగా లండన్లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్, సీఈఓ జూలియా ఎవెలిన్ మోర్లీ హైదరాబాద్ రెండు రోజుల క్రితమే చేరుకున్నారు.మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సమీక్షలుమిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించాల్సిన వివిధ ప్రదేశాలు, ఈవెంట్ ప్లానిం గ్, ఈవెంట్ నిర్వహణలో పాల్గొన్న బహుళ విభాగా లు, ఏజెన్సీలతో మోర్లీ సమీక్షిస్తారు.మిస్ వరల్డ్ సంస్థ నుంచి సీనియర్ అధికారి హెన్రిక్ ఫోంటెస్ కూడా వచ్చారు.శంషాబాద్ విమానా శ్రయంలో హైదరాబాద్ మిస్ వరల్డ్ స్థానిక నిర్వాహక బృందం ఆయన కు కూడా హృదయపూర్వక సాంప్రదాయ స్వాగతం పలికింది.