
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణంలో కోర్ట్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈరోజు శుక్రవారం రోజున తెలంగాణ హై కోర్ట్ జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హైదరాబాద్ వెల్లిన నాయకులు కోర్ట్ మంజూరు చేయడం పట్ల భీంగల్ మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కోర్ట్ మంజూరు అయ్యిందని, కోర్ట్ ఏర్పాటు కు కావాల్సిన సౌకర్యాలు నాయకులు సమాకూర్చడం ద్వారా కోర్ట్ కు సంబందించిన పనులు ప్రారంభం చెయ్యడం జరుగుతుందని ఈ సందర్బంగా తెలిపినట్టు అఖిలపక్షం నాయకులు తెలిపారు. అనంతరం నిజామాబాదు జిల్లా కోర్ట్ ఇంచార్జి జడ్జి మేడం మాధవి దేవి ని అఖిల పక్షం నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కోర్ట్ ఏర్పాటు కు కావాల్సిన భవనం, ఇతర సౌకర్యాలను అఖిల పక్షం ఆధ్వర్యంలో చూస్తామని తెలిపారు. కోర్ట్ మంజూరు అయిన నేపథ్యంలో అన్ని సమకూర్చేందుకు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. అక్కడి నుండి భీంగల్ మండల వాస్తవ్యులు, రహత్ నగర్ గ్రామస్తులు పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. వీరిని కలిసిన వారిలో అఖిలపక్షం నాయకులు, సభ్యులు ఉన్నారు.

