ఆదివాసి చట్టాలు కాపాడుకోలేని ఎమ్మెల్యేలు ఎందుకు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 18
శనివారం నాడు గంగవరం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అధికారులు ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసులకు కల్పించబడ్డ చట్టాలు అమలుకు నోచుకోకపోవడం వలన నాన్ ట్రైబల్స్ విచ్చలవిడిగా వలసలు వచ్చి ఏజెన్సీలోని మండల కేంద్రాలు అన్నిటిని కూడా వ్యాపార సముదాయాలుగా మార్చేశారని, నాన్ ట్రైబల్ వలసలను అరికట్టకపోవడం వలన ఏజెన్సీ చట్టాలు పూర్తిగా నిర్వీరమైపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. చట్టాలు ప్రకారం న్యాయస్థానాలు అక్రమ కట్టడాలను తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చిన అక్రమ కట్టడాలను గుర్తించి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు తప్ప నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలను మాత్రం కూల్చడం లేదని, చట్టాలనోల్లంగించి భవనాలు వ్యాపార దుకాణాలు కట్టి వ్యాపారం చేస్తున్నా కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. స్థానిక పంచాయతీ రెవెన్యూ అధికారుల నుండి జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడం దుర్మార్గమైన విషయమని ఆయన మండిపడ్డారు. గుర్తించిన అక్రమ కట్టడాలను కూడా కూల్చకుండా వాళ్ళ దగ్గర నుంచి అధికారులు సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు *ఆదివాసి ఎమ్మెల్యేలు ఉన్నది ఎవరికోసం రాజ్యాంగం ద్వారా ఆదివాసులకు సంక్రమించిన రాజకీయ రిజర్వేషన్ తోటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా గెలుస్తున్నటువంటి ఆదివాసి ప్రజాప్రతినిధులు ఆదివాసి చట్టాల అమలు కోసం రిజర్వేషన్ పరిరక్షణ కోసం కృషి చేయకుండా ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అదే రిజర్వేషన్ లేకపోతే ఒక పార్టీ కూడా ఆదివాసులకు సీట్ ఇవ్వదని ఆ విషయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు గుర్తుతెచ్చుకోవాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలలో నాన్ ట్రైబల్ అభివృద్ధి కోసం హక్కుల కోసం మాట్లాడటానికి 168 మందు ఎమ్మెల్యేలు ఉన్నారని ఆదివాసి హక్కుల కోసం ఆదివాసి సంరక్షణ కోసం అభివృద్ధి కోసం ఆదివాసి రిజర్వేషన్ తో ఎన్నుకోబడిన ఆదివాసి ఎమ్మెల్యేలు కూడా తాము ఆదివాసులు అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తూ చట్టసభలో ఆదివాసి హక్కుల కోసం చట్టాలు అమలు కోసం గళం ఎత్తకుండా నాన్ ట్రైబల్స్ అభివృద్ధి కోసం హక్కుల కోసం మాట్లాడటం సిగ్గుమాలిని చర్య అని ఆయన మండిపడ్డారు. ఆదివాసి చట్టాలు అమలు కోసం రిజర్వేషన్ పరిరక్షణ కోసం అభివృద్ధి కోసం కృషి చేయని ఎమ్మెల్యేలను రాబోయే ఎన్నికల్లో ఆదివాసీలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆదివాసి ఎమ్మెల్యేలు నాన్ ట్రైబల్స్ కి ఊడిగం చేయడం మానేసి ఒకసారి ఆదివాసి గ్రామాలలో పర్యటన చేసి ఆదివాసి సమస్యలు తెలుసుకోవాలని అప్పుడు తెలుస్తుంది ఆదివాసులు సరైన మౌలిక సదుపాయాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అని ఆయన అన్నారు. ఆదివాసి సంక్షేమ పరిషత్ బృందం రంపచోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివాసి గుడెల్లో పర్యటన చేస్తుందని ఈ పర్యటనలో ఆదివాసీల సమస్యలల్లో అర్ధనాథాలు కనిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ నాయకులు పీటా ప్రసాద్, కంగాల అబ్బాయి దొర, కలుముల ప్రసాద్, చోడి ఏడుకొండల దొర, వేట్ల హనుమంత రెడ్డి, పరద సత్యనారాయణ, కాలుముల జోగి రాజు,కారం శ్రీను తదితరులు పాల్గొన్నారు