పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ ఇంచార్జ్ ఆగస్టు28
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని ఆర్ అండ్ బి, రెవిన్యూ, పంచాయితీ, ఆదివాసి భూములను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై వ్యాపారాలు, వ్యవసాయాలు చేస్తున నాన్ ట్రైబల్స్ పై చర్యలు తీసుకోవాలని, అక్రమ కట్టడాలు తొలగించాలని కోరుతూ ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం నాడు ఎటపాక తాసిల్దారు వారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ ఎటపాక మండలంలోని ఎటపాక, లక్ష్మీదేవి పేట మేడుడువాయి (తెలంగాణ సరిహద్దు ప్రాంతం ), పురుషోత్తపట్నం, రాయనపేట, నెల్లిపాక, చింతలగూడెం, సీతంపేట కన్నాయిగూడెం, లక్ష్మీపురం, పాలమడుగు, బాస వాగు, రామ్ గోపాల్ పురం, గన్నవరం, గౌరీ దేవి పేట మరియు గోదావరి పరిహార ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ వేలాది ఎకరాల భూములను కబ్జా చేసి వ్యవసాయాలు చేస్తున్నారని, అదేవిధంగా ఆర్ అండ్ బి స్థలాలు, రెవిన్యూ, పంచాయితీ స్థలాలు ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టి వ్యాపారాలు చేస్తున్నారని వీటన్నిటిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఎటపాక ఏజెన్సీలో 1/70 చట్టం అమలులో ఉన్నప్పటికీ నాన్ ట్రైబల్స్ విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతూ భూముల ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కడుతున్నారని, అలాగే పలుచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇటువంటి వాటిపై విచారణ జరిపి అక్రమాలను తొలగించాలని, భూకబ్జాలకు పాల్పడే నాన్ ట్రైబల్స్ పై క్రిమినల్ కేసులు వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం ఎటపాక మండలంలోని అన్ని రకాల ఎంక్రోచ్మెంట్స్ ను తొలగించాలని ఆయన అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు పైద పరమేష్ ఉన్నారు.