పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 18:- రిపోర్టర్ (కే. శివ కృష్ణ) బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో బీసీ అగ్నికుల క్షత్రియ భవనము నిర్మించుకొనుటకు అనువైనటువంటి ప్రభుత్వ స్థలమును 10 సెంట్లు రికార్డు ప్రకారము ఇచ్చే విధంగా కోరటం గురించి మున్సిపల్ కమిషనర్ కు ఆంధ్రప్రదేశ్ బీసీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు సోమవారము అర్జీ విన్నపము అందజేశారు. విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు( డైరెక్టర్ ) మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని బిసి అగ్నికుల క్షత్రియులు సముద్ర వృత్తిపై ఆధారపడి బడుగు బలహీన వర్గమునకు చెందినటువంటి కుటుంబీకులకు మీటింగ్సుకు, ఫంక్షన్లకు, పేద విద్యార్థులకు విద్యను అభ్యసించే విధముగా ఉండుటకు గాను, రాష్ట్ర నలుమూల నుండి బాపట్ల జిల్లాకు ఆయా అవసరం నిమిత్తం వచ్చేటటువంటి అగ్నికుల క్షత్రియ కుటుంబీకులకు అన్ని విధముల ఈ యొక్క భవనమును నిర్మింపుకొనుటకు అనువైనటువంటి ప్రభుత్వ స్థలమును మున్సిపాలిటీ పరిధిలో ఇప్పించి అగ్నికుల క్షత్రియులకు తమ వంతు తగు న్యాయం చేయగలరని కమిషనర్ ను కోరారు. కార్యక్రమంలో పీత రామ్మోహన్ రావు( కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ) కొక్కిల గడ్డ చంద్రబాబు (మత్స్యకార సంక్షేమ సమిత బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ) కృష్ణంరాజు, బాలచందర్రావు బీసీ అగ్నికుల క్షత్రియ సభ్యులు పాల్గొన్నారు.