పయనించే సూర్యుడు న్యూస్ తాడిపత్రి ప్రతినిధి కుళ్లాయప్ప 3
అనంతపురం నగరంలో ని గవర్నమెంట్ హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డ్ దగ్గర రామాంజినమ్మ అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది 3-1-2025 న ఉదయం 7 గంటల సమయంలో మైనార్టీ కాలనీలో నివాసం ఉంటున్న రామాంజునమ్మ తన ఇంటి ముందర నీటితో శుభ్రం చేసుకుంటుండగా పక్కింటి వారి ముందర నీళ్లు పడినాయని ముని అతని భార్య రాధ నానా బూతులు తిట్టి విచక్షణారహితంగా తనపై రక్త గాయాలు అయ్యే విధంగా దాడి చేశారని తెలిపింది అంతేకాకుండా ఇలా పది సంవత్సరాల నుండి మానసికంగా సూటిపోటి మాటలతో ముని రాధ వీరిద్దరూ నన్ను రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని రాప్తాడు పోలీస్ స్టేషన్లో పలుసార్లు కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు న్యాయం చేయడం లేదని అంతేకాకుండా ముని రాధ వీరిద్దరూ మీరు ఎక్కువ మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మిమ్మల్ని లోపల ఎపిస్తాము అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నా భర్త విధి నిర్వహణలో భాగంగా కరెంట్ ఆఫీస్ లైన్మెన్ గా పనిచేస్తున్నాడు విధి నిర్వహణలో నా భర్త 24 గంటలు కరెంటు పని మీద తిరుగుతుంటాడు కావున నాకు నా భర్తకు వీరు నుండి ప్రాణహాని కూడా ఉన్నదని కావున ఎస్పీని నా విన్నవాన్ని ఆలకించి ముని రాధా వారి నుండి రక్షణ కల్పించి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను