ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టియుసిఐ
టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసూర్యం
పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు139 వ మేడే ను జయప్రదం చేయాలని, మే డే స్ఫూర్తితో పని గంటల పెంపుకు వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై, లివింగ్ వేతనంకై, కనీస పెన్షన్ 9000 రూపాయల కోసం పోరాడాలని టి యు సి ఐ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సూర్యం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లందు చండ్ర కృష్ణమూర్తి, మెమోరియల్ ట్రస్ట్ భవనంలో, ఆర్. మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు తరాల కార్మిక వర్గం పోరాడి, రక్త తర్పణ చేసి 8 గంటల పని దినం, హక్కులు సౌకర్యాలు సాధిస్తే నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికుల శ్రమను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి, ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్నదని దానిలో భాగంగానే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని అన్నారు. ఇలాంటి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలంటే బలమైన కార్మిక, ప్రజా పోరాటాలే మార్గం అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, సహాయ కార్యదర్శి నూప భాస్కర్ ఉపాధ్యక్షులు గోపాలరావు, కోశాధికారి పాయం వెంకన్న, కమిటీ సభ్యులు మల్లెల వెంకటేశ్వర్లు వేముల గురునాథం మల్సూరు జాన్, తదితరులు పాల్గొన్నారు.