
{పయనించే సూర్యుడు {ఫిబ్రవరి 13 మక్తల్ }
స్థానిక పట్టణం లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుందాం అను గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు కే. సత్యనారాయణ గౌడ్ నారాయణ పేట జిల్లా భజరంగ్ దళ్ కో- కన్వీనర్ పి.భీమేష్ మాట్లాడుతూ ప్రేమికుల రోజు ను పాశ్చాత్య దేశాల విష సంస్కృతి విడనాడాలని సూచించారు.ఫిబ్రవరి 14 న పుల్వామా దాడిలో దేశం కోసం వీరమరణం పొందిన ఆర్మీ జవాన్లను స్మరించుకుని*, వారికి ప్రతి ఒక్కరూ నివాళలు అర్పించాలని వారు కోరారు.ఇట్టి కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రఖండ సంయోజక్ రాహుల్. ప్రఖండ సహా సంయోజక్ మూర్తి. మండల సంయోజక్ రామాంజనేయులు . గోరక్ష ప్రముఖ్ నాగరాజ్. గోరక్ష సహా ప్రముక్ అక్షయ్. నవీన్. అంజి. శివ.ఆనంద్ బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు