పయనించే సూర్యుడు జులై 12. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనుదీప్ దురిశెట్టి రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. రెవెన్యూ శాఖ పరిధిలో ఒకే చోట చాలా కాలం నుండి పనిచేస్తున్న 14 మంది కంప్యూటర్ ఆపరేటర్లను, 21 మంది భూ భారతి ఆపరేటర్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు గాను ఎన్నో ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్న వారిని బదిలీ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ శాఖలో సిసిఎల్ఏ పరిధిలో టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లు, భూభారతి ఆపరేటర్లుగా పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేసి రిలీవింగ్, జాయినింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత మండలాల తహసిల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. పాలనలో జవాబుదారీతనం, పూర్తి పారదర్శకత దిశగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది విధుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు న్యాయం చేకూర్చాలనే నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు.