
పయనించే సూర్యుడు డిసెంబర్ 28( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో , 141 వ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు, నాయకులతో, ఏ ఐ సి సి నాయకులు రాహుల్ గాంధీ, మరియు పి సి సి అధ్యక్షురాలు షర్మిల మేడం ఆదేశాలతో, డి సి సి బాలగూరవం బాబు ప్రేరణతో- సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ యస్. సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిజిల్లా ఉపాధ్యక్షుడు దేవదానం తుమ్మ అధ్యక్షతన ఉత్సవ సభ ఏర్పాటు చేయడమైనది. ఈ సుభసందర్భమున కేక్ కట్ చేసి యావన్మందికి పంచిపెట్టడం జరిగింది.భారత దేశానికి, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగంతో మొట్టమొదటిసారి ప్రజాస్వామ్య పాలనలో ప్రజలను నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆనాటి సంస్కరణలతోనే, ఆనాటి బహుళార్ధసాదక ప్రాజెక్ట్లతోనే ఈనాడుకూడా ఈ దేశం నడుస్తున్నదనడంలో అతిశయోక్తిలేదు. పేర్లు మార్చడం తప్పితే పేరుకొక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించింది లేదు.ఆ తర్వాత ఇప్పటివరకు మరి ఏఇతర రాజకీయ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్ట్ నిర్మించిన దాఖలాలు లేవు.అప్పటి ప్రయోజనకరమైన ప్రాజెక్ట్లే ఇప్పటికికూడా నడుస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ పాలనావిధానము, సేవాతత్పరత గమనార్హము. ఆతర్వాత కుంటుబడిన అభివృద్ధికి, సమభావం, ప్రజాస్వామ్య శైలికి మళ్ళీ జవజీవాలు నింపాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ , సూళ్లూరుపేట టౌన్ వైస్ ప్రెసిడెంట్, యాసిన్ భాష, తడ మండలం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, తడ మండల ఓ బి సి చైర్మన్ CH. మహేంద్ర యాదవ్, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
