
పంచాయతీలకు రూ 387.53 కోట్లు .. మూడో విడతగా 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదల
15వ ఆర్థిక సంఘం నిధులు మరియు ఇతర నిధులు కేవలం గ్రామ అభివృద్ధి పనులకు మాత్రమే ఉపయోగించాలి.
పారిశుధ్యంతాగునీటి సరఫరావీధి దీపాల నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
నిధుల ఖర్చులో పారదర్శకత ఉండాలి మరియు రికార్డులను సక్రమంగా నిర్వహించాలి.
ప్రతి పనిని ఆన్లైన్లో నమోదు చేయాలి.
నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయి.
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 28.
నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులుజనరల్ ఫండ్స్‌ను నిబంధనల ప్రకారంప్రాధాన్యతా పనులకు మాత్రమే ఖర్చు చేయాలనిఅక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పారిశుధ్యంతాగునీరు వంటి అత్యవసర పనులకు నిధులు కేటాయించాలనిప్రజా అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై కలెక్టర్ కార్యాలయం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. నిధుల దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని ఆదేశించింది. బేసిక్ గ్రాంట్లను 29 రకాల అభివృద్ధి పనులకు (జీతాలు మినహా) వాడవచ్చని తెలిపింది. టైడ్ గ్రాంట్లలో 50% పారిశుధ్యానికి, 50% తాగునీటి సరఫరాకు కేటాయించాలని పేర్కొంది. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రాధాన్యత క్రమంలో మార్చి 5, 2026 లోపు చెల్లించాలన్నారు.
