పయనించే సూర్యుడు సెప్టెంబర్ 17 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండలం రిపోర్టర్ రేవల్లి కృష్ణబాలానగర్ మండల కేంద్రంలోని నేరెళ్లపల్లి గ్రామంలో గత నెల రోజులుగా నీటి కష్టాలు ఎదుర్కోలేక రోజువారి అవసరాల నిమిత్తం వాడుకోవడానికే కాకుండా కనీసం త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న వేళ గ్రామ యువకులు తాజా మాజీ ఎంపీటీసీ అయిన లింగ్యా నాయక్ గదృష్టికి తీసుకెళ్లడంతో తాను స్వయంగా వచ్చి ఆ కష్టాలను చూడలేక చలించి పోయి తన సొంత ఖర్చుతో బోరు వేయించడంతోపాటు మోటారు బిగించి ఆన్ చేసి నీళ్లు రప్పించారని స్థానిక యువకులు తెలియజేశారుపదవి ఉన్నా లేకున్నా గ్రామం పట్ల తనకున్న నిబద్ధత మమకారం చూసి యువకులు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగు నాయక్ రేవల్లి యాదయ్య బి శ్రీనివాసులు నరేష్ గౌడ్ హనుమంతు సురేందర్ వడ్డే శేఖర్ బి యాదయ్య రేవల్లి రాజు సుధాకర్ గౌడ్ వెంకటేష్ సత్యం తదితరులు పాల్గొనీ హర్షం వ్యక్తం చేశారు