ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వర్యులు
ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు
పయనించే సూర్యుడు జనవరి 17 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి)...18వ తేదీన శనివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వావిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి కార్యక్రమం సందర్బంగా మండల కేంద్రమైన చేజర్ల బస్టాండ్ సెంటర్ నందు ఉదయం 9:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించి జరుగుతుందని
చేజర్ల మండలంలో అన్ని గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు అందరు పాల్గొని పైకార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుకుంటున్నానని శుక్రవారం చేజర్ల మండలం టిడిపి అధ్యక్షులు
రావి లక్ష్మీనరసారెడ్డి తెలిపారు