
పయనించే సూర్యుడు ఆగస్టు 11 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)గడపగడపకు కూటమి పాలన ఫలాలు వివరించిన జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి ముమ్మిడివరం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం పట్టణం 15వ వార్డులో జరిగిన ఇంటింటి కార్యక్రమంలో ఎన్డిఎ కూటమి 2 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం కార్యక్రమంలో పాల్గొని ఎన్డిఎ కూటమి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకురాలు, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని, రాష్ట్ర ఎస్సి మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, ముమ్మిడివరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా సత్తిబాబు, మాజీ కౌన్సిలర్ మద్దాల మంగ సత్య కుమారి, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు యాళ్ల ఉదయ్, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కడలి నాగు, దాట్ల బాబు, మాజీ కౌన్సిలర్ విళ్ల వీరాస్వామి నాయుడు, సత్తి నూకరాజు, ముమ్మిడివరం పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి, ముమ్మిడివరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు భీమవరపు శ్రీనివాస్, పాయసం చిన్ని మరియు ఎన్డిఎ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.