యనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 16.
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ ముందు రెండు రోజున జరిగిన రిలే నిరాహార దీక్షలు కార్యక్రమానికి ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ధ్యక్షత వహించారు.ఈ రిలే నిరాహార దీక్షలు సందర్భంగా ఆదివాసి జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ మాట్లాడుతూ…2025 మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ఆదివాసి ఉపాధ్యాయ పోస్టులు మినహాయించి ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల యాలని,ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని,జీవో నెంబర్ 3 చట్ట బద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు అరకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని,వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని,ఐటిడిఏల ద్వారా ట్రైకార్ రుణాలు నిరుద్యోగ యువతకు మంజూరు చేయాలని మొదలైన సమస్యల పరిష్కారం కోసం సిఎం చంద్రబాబు నాయుడుకి వినతి పత్రం ఐటిడిఏ పిఓ కట్టా సింహాచలం ద్వారా పంపించాలని వినతిపత్రం అందజేస్తామన్నారు.మడకం బంగారు బాబు మాట్లాడుతూ… ఆదివాసి నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆదివాసీ నిరుద్యోగులకు పట్ట భద్రులకు స్పష్టమైన హామీ సీఎం చంద్రబాబు ఇచ్చేంత వరకు రిలే నిరాహార దీక్షలు దశలవారీగా కొనసాగిస్తామన్నారు.ఈ రిలే నిరాహార దీక్షలు కార్యక్రమంలో కొమరం సూర్యచంద్ర దొర,మట్ల కృష్ణారెడ్డి,కుంజం వెంకన్న దొర కొండ్ల సత్యనారాయణ రెడ్డి,కారం రామన్న దొర,మద్దేటి అంజిరెడ్డి,చెదల శిరీష కుమారి,సాదాల దేవి,చెదల కనకమహాలక్ష్మి, పోడియం పండు దొర,చవలం శుభకృష్ణ దొర,పండా పవన్ కుమార్,కుంజం అగ్గిదొర,కత్తుల ఆది రెడ్డి,శారపు నాగేశ్వరరావు,కొమరం కిషోర్ దొర,మూలపర్తి గౌరీ శంకర్,మడకం శివ దుర్గాప్రసాద్ దొర,కత్తులు నాగేంద్ర ప్రసాద్ రెడ్డి,కురసం పకీర్ దొర,కారం జగన్ స్వరూప్ దొర,కడబాల లక్ష్మీనారాయణ,నడిపూడి సంజీవరెడ్డి,ఎన్.శ్రీనివాసరావు,మడకం వరప్రసాద్ దొర,ఈక వెంకన్న దొర,చవలం వెంకన్న దొర,కడబాల రాంబాబు రెడ్డి,బొరగా పొట్టి దొర,నైని లచ్చి రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు.