
పయనించే సూర్యుడు మే 7 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరు పేట లో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిటిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ ప్రెస్ మీట్ లో హరికృష్ణ మాట్లాడుతూ తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే పార్టీ 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా తమిళ రాజకీయాల్లో ప్రజల మద్దతుతో ఒక మార్పు తీసుకువచ్చింది అయితే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు, మిగతా 11 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం ఇందులో కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలతో మద్దతు ఇచ్చింది అని పేర్కొన్నారు దీంతో మిగతా వారిని కలుపుకొని సీఎం అభ్యర్థి అయినటువంటి విజయ్ ఇంచార్జ్ గవర్నర్ ని అపార్ట్మెంట్ కోరి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరగా అందుకు గవర్నర్ అనుమతించలేదు అతిపెద్ద పార్టీగా టీవీకే ఉండగా గవర్నర్ టి వీ కే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుండా కాలయాపన చేయడం వెనుక బిజెపి కుట్రలో భాగమే ! అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలిపారు దేశంలోని దళిత రాజకీయ పార్టీలు రాజకీయ వేత్తలుఆలోచించాలి తమిళనాడులో దళిత పార్టీగా చెప్పుకునే విసికె తిరుమల వలన్ మద్దతు తెలుపలేదు ఎందుకు? తమిళనాడు రాష్ట్రంలో ఒక దళిత బిడ్డ ముఖ్యమంత్రి అవ్వడం అక్కడున్న ద్రవిడ పార్టీలు కనుమరుగుతాయని ఎలాగైనా సరే విజయ్ ని సీఎం కాకూడదని శత్రువులుగా ఉన్న ఏడీఎంకే, డీఎంకే పార్టీలు కూడా మిత్రులు అవడానికి ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మీరు నిజమైన దళితుల పట్ల మీకు కృతజ్ఞత ఉంటే దళిత ఎమ్మెల్యేలు అందరూ కూడా టీవీ కే పార్టీ అధినేత విజయ్ మద్దతు తెలిపి టీవీకే అధినేత విజయ్ ని ముఖ్యమంత్రి చేయాలని దళిత బహుజన నాయకుడు .కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ కోరారు