

పయనించే సూర్యుడు మే 8 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ‘జనతా వారధి’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కన్వీనర్ చీకరమెల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ప్రజల నుండి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, వాకలగరువు గ్రామంలో 12 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. అలాగే జిల్లాలో పలు మండలాల్లో యదేక్షగా బిల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, వీటిని వెంటనే అరికట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు, లేనిపక్షంలో వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ద్వారా నివేదిస్తామని తెలిపారు.అలాగే అంబాజీపేట, అల్లవరం, ముమ్మిడివరం, అంబాజీపేట, అల్లవరం, ముమ్మిడివరం అమలాపురం టౌన్, వివిధ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని పలు దరఖాస్తులు అందాయని, వాటిని వచ్చే సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారి కి సమర్పించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం టౌన్ అధ్యక్షులు అయ్యాల భాస్కరరావు, సీనియర్ నాయకులు చెరుకూరు గోపాలకృష్ణ, కురస ఆంజనేయులు, పెద్దిరెడ్డి శ్రీనివాస్, చీకరమెల్లి సుబ్రహ్మణ్యం, కట్ట నారాయణమూర్తి రాగిరెడ్డి సాయిరాం, గిడుగు శివశేఖర్, అడపా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.