
రైతుల ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి
రైతులను దోపిడీ చేస్తున్న రైస్ మిల్లుల యజమానులు
మే 11న కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి
సి ఆర్ గోవింద్ రాజ్ సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు

పయనించే సూర్యుడు మే 10మక్తల్ మక్తల్ మండల పరిధిలో దాసర్ దొడ్డి కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం బృందం సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించడం జరిగింది. ధాన్యం కొనుగోలు తీవ్రంగా అలసత్వం జరుగుతుందని, బస్తకు అదనంగా కిలో ధాన్యాన్ని తీసుకుంటున్నారన, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులతో సాంప్రదించి అవకతవకలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు వాతావరణం దృష్టే ధాన్యాన్ని కొనుగోలు చేసి అందుబాటులో లారీలని ఉంచి ధాన్యాన్ని తరలించాల్సిందిగా అధికారుల ను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం జిల్లా కమిటీ సభ్యులు సి ఆర్ గోవింద్ రాజ్, పి రాము, ఏం మంజప్పా, వెంకటేష్, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.