
కేశంపేటలో బీఆర్ఎస్ నిరసన
( పయనించే సూర్యుడు మే 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కేశంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేశంపేట పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలికకు సంబంధించిన ఇలాంటి తీవ్రమైన కేసులో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. నిందితుడు ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్లాస్ ఖాన్పేట సర్పంచ్ హరిశేఖర్ యాదవ్, చింతకుంటపల్లి సర్పంచ్ రమేష్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ సురేందర్, కొత్తపేట మాజీ సర్పంచ్ నవీన్ కుమార్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, బీఆర్ఎస్ నాయకులు సాజిద్, రామకృష్ణ, సత్యనారాయణ, దశరథ్, నాగేష్, రాజు, దండే రమేష్, యాదయ్య, అమరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.