
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న 7 రోజుల విద్యా వారోత్సవాల పోస్టర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. బుచ్చయ్య పోస్టర్ను ఆవిష్కరించి వారోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారోత్సవాల్లో ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించేందుకు, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సృజనాత్మకత అభివృద్ధికి అనుగుణంగా వివిధ అకాడమిక్, సాంస్కృతిక, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రతి రోజు నిర్వహించే కార్యక్రమాల వివరాలను అధ్యాపకులకు, విద్యార్థులకు తెలియజేస్తూ వారందరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. రఘునాథ్ , ఐక్యాక్ కోఆర్డినేటర్ డా. యు. రవి కుమార్ , అడ్మిషన్ కోఆర్డినేటర్ డా. భీమారావు పాల్గొన్నారు.అలాగే సీనియర్ అధ్యాపకులు డా. ఎం. శంకర్ గారు, ఆరే రాజు , డా. ఓంప్రకాశ్ , డా. సంతోష్ కుమార్ , డా. నహేదా , డా. కల్పన పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.