
పయనించే సూర్యుడు 11 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్బాల్కొండ నియోజకవర్గంలోరైతు కంట కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటువడ్ల కొనుగోలులో జాప్యం, కోతలతో రైతులను నిలువునా ముంచుతున్న రేవంత్ రెడ్డి సర్కార్కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగ.. నేడు కాంగ్రెస్ పాలనలో దండగప్రైవేట్ వ్యాపారులకు రైతులను తాకట్టు పెడుతున్న ప్రభుత్వం – క్వింటాల్‌కు రూ.500 నుండి రూ.600 వరకు నష్టంనిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రైతు ధర్నాలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన మండి పడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు కరెంటు, నీళ్లు, మద్దతు ధర కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు వ్యవసాయాన్ని పండుగలా మార్చామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు మళ్లీ రోడ్లపై ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ప్రభుత్వం ప్రచారం చేస్తోందే తప్ప, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. గన్నీ సంచులు లేవు, లారీలు అందుబాటులో లేవు, కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. “లారీలు ఉన్న చోట సంచులు లేవు.. సంచులు ఉన్న చోట లారీలు లేవు” అంటూ పౌర సరఫరాల శాఖ వైఫల్యాన్ని ఎండగట్టారు.తాను ఇటీవల నియోజకవర్గంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు మహిళా రైతులు సహా రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూసి కలచివేసిందన్నారు. వర్షాల భయంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2380 ఉండగా, వ్యాపారులు కేవలం రూ.1750 నుండి రూ.1900 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల రైతుకు ఎకరాకు రూ.15 వేల నుండి రూ.20 వేల వరకు నష్టం జరుగు తోందని వివరించారు.రైస్ మిల్లర్లు తరుగు పేరిట రైతులను బహిరంగంగా దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం కిలోన్నర వరకు మాత్రమే తరుగు ఉండేదని, ఇప్పుడు క్వింటాల్‌కు 5 కిలోల నుండి 12-15 కిలోల వరకు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. 41.5 కిలోలకు మించి అదనపు తరుగు పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లను ప్రభుత్వం అరికట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యల కంటే ఇసుక దందాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు. కలెక్టర్, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు ఎత్తడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలతోనే బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.రైతు బంధు నిధులు సక్రమంగా అందడం లేదని, రెండు లక్షల రుణమాఫీ ప్రకటనలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. “నిజామాబాద్ జిల్లాలో ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిందని రైతులే చెబితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా” అంటూ సవాల్ విసిరారు.యూరియా సరఫరాపైనా ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ హయాంలో ఎరువులు సులభంగా అందుబాటులో ఉండేవని, ఇప్పుడు యాప్ విధానం పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి అన్ని సొసైటీల ద్వారా యూరియాను విరివిగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లు చేశారు:రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలి.సరిపడా గన్నీ సంచులు, లారీలు అందుబాటులో ఉంచాలి.41.5 కిలోలకు మించి తరుగు పేరిట జరుగుతున్న అక్రమ వసూళ్లను కఠినంగా అరికట్టాలి.అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలి.దొడ్డు రకాల ధాన్యానికి కూడా గ్రేడ్-1 మద్దతు ధర కల్పించాలి.యాప్ విధానాన్ని రద్దు చేసి యూరియాను అన్ని సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాలి.ప్రభుత్వానికి 10 రోజుల గడువు ఇస్తున్నామని, ఈలోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే బాల్కొండ నియోజకవర్గంలోని పోచంపాడ్ నుండి చిట్టాపూర్ వరకు, లక్కోరా నుండి కమ్మర్పల్లి వరకు ప్రధాన రహదారులను రైతులతో కలిసి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వంటా-వార్పు కార్యక్రమాలతో ఎలా పోరాడామో, అదే స్ఫూర్తితో రైతులే నాయకులుగా ముందుకు వచ్చి పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు, రైతుల డిమాండ్లు నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.ధర్నా నిర్వహిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్బాల్కొండ నియోజక వర్గంలో వడ్ల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మోర్తాడ్‌లో నిర్వహించిన రైతు ధర్నా ఉద్రిక్తంగా కొనసాగింది.ధర్నా సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి రైతుల డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు.దీంతో కలెక్టర్ తరఫున జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ DSO శ్రీకాంత్ తదితర అధికారులు ధర్నా స్థలానికి చేరుకుని రైతుల సమస్యలపై అక్కడినుండే కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడించిగా వడ్ల కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని, అలాగే రైతులు ఉంచిన ఇతర డిమాండ్లను కూడా సానుకూలంగా పరిశీలించి అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, రైతులు ధర్నా విరమించారు.నియోజకవర్గములో ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ లు ఒక ఇంచార్జ్ ఉండి రైతులు బాధలు తీర్చలేకపోతున్నారుబాల్కొండ నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ నాయకులకు పట్టడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.నియోజకవర్గంలో ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉన్నప్పటికీ ఒక్కరైనా రైతుల సమస్యలపై స్పందించడం లేదన్నారు.కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఇటీవల తాను PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి రుణమాఫీ విషయంలో ఛాలెంజ్ చేశానని, దానికి ప్రతిగా వేల్పూర్‌లో ప్రెస్ మీట్ పెట్టి “చర్చకు ఎక్కడికి రావాలి?” అంటూ సవాల్ విసురుతున్నారని తెలిపారు.“మీరు ఛాలెంజ్‌లు విసరడం వల్ల కల్లాల మీద ఉన్న వడ్లు ఎత్తుకుపోతారా?” అని ప్రశ్నించిన వేముల ప్రశాంత్ రెడ్డి , ప్రభుత్వం లో ఉన్న నాయకులు రాజకీయ సవాళ్లు విసరడం మానేసి రైతులు పంట అమ్ముకునే విషయంలో ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించాలని సూచించారు.“మీ స్వగ్రామమైన మానాలాలోనే ఒక లారీ కూడా రాక రైతుల దగ్గర నుండి ఒక్క సంచి వడ్లు కొనలేకపోయారు… అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఛాలెంజ్‌లు చేయడం హాస్యాస్పదంగా ఉంది” అని ఘాటుగా విమర్శించారు.అలాగే, “ఇక్కడి కాంగ్రెస్ ఇంచార్జ్‌కు ఇసుక లారీలు దొరుకుతున్నాయి కానీ రైతుల వడ్లు తరలించడానికి మాత్రం లారీలు దొరకడం లేదు” అని ఎద్దేవా చేశారు.