
పయనించే సూర్యుడు : అమలాపురం మండలం సమనసలో వేంచేసియున్న శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని మహిళలు, యువత తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.