
పయనించే సూర్యుడు 13 మే 20 26 జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ప్రభుత్వ డిగ్రీ కళాశాల భీమగల్ అధ్యాపక బృందం, భీమగల్ మండలం బెజ్జోర గ్రామంలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రగతి పాలన - ప్రజా ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా, కళాశాల అధ్యాపకులు బెజ్జోర గ్రామ సర్పంచ్ మేస కార్తిక్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తో కలిసి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల చేరికలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన "గోడ పత్రిక మరియు కరపత్రాలను" విడుదల చేశారు అలాగే లింగాపూర్ గ్రామ సర్పంచ్ ని కూడా కలవడం మరియు వారిచే కళాశాల ప్రచార పోస్టర్ లను విడుదల చేయడం జరిగింది