

క్రీడలు మరియు పశుసంవర్ధక శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి
అంగరంగ వైభవంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ట
హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్ క్యాంపు కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల స్వాగతం
ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర క్రీడలు మరియు పశుసంవర్ధక శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, నందిగామ మాజీ ఎంపీపీ ప్రియాంక గౌడ్ దంపతులు తదితర గ్రామ పెద్దలు కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అంతకు మందు షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రభుత్వ క్యాంపు కార్యాలయానికి మంత్రి వచ్చారు. అక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్ తదితర కాంగ్రెస్ నాయకులు మంత్రికి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎమ్మెల్యేతో కలిసి చేగుర్ గ్రామానికి వచ్చారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఎమ్మెల్యే, ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మంచనపల్లి ప్రియాంక శివ శంకర్ గౌడ్ దంపతుల మంత్రి ఎమ్మెల్యే ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్,గ్రామ సర్పంచ్ మంకాల శ్రీశైలం, ఉపసర్పంచ్ ఆవుల శివశంకర్, వార్డు సభ్యులు భాస్కర్ గౌడ్, సోలిపేట శ్రీనివాస్, సురేష్, కావలి భీమయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ చారి, సర్పంచులు బుగ్గ సాలయ్య, గొల్లపల్లి అశోక్, కొమ్ము కృష్ణ, మల్లేష్, పబ్బయి శ్రీశైలం, మాజీ సర్పంచ్ వీరేందర్ గౌడ్, సతీష్ పటేల్, కుమారస్వామి గౌడ్, సుదర్శన్ గౌడ్, కృష్ణ రెడ్డి, కౌన్సిలర్ రాజు నాయక్ పెంటయ్య, మురళీ మోహన్ అప్పి, సాదిక్, ముబారక్ అలీఖాన్, సయ్యద్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు..