
పయనించే సూర్యుడు మే 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ : జూలూరుపాడు: వెంకన్నపాలెం గ్రామంలో ఈరోజు దుద్దుకూరి నాగేశ్వరావు కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది.ఈ వివాహానికి ముఖ్యఅతిథులుగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకురాలు బానోత్ మంజుల మన ప్రియతమ నాయకులు మదన్ లాల్ కుమార్తె మనిషా లక్ష్మీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.దుద్దుకూరి నాగేశ్వరావు మదన్ లాల్ అనుచరులుగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడి వివాహానికి స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. వివాహ వేడుకలో వధూవరుల కు శుభాకాంక్షలు తెలియజేసిన నేతలు, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అంతా ఆనందోత్సాహాల మధ్య సాగింది. ఈ కార్యక్రమంలో అజ్మీరా రైలు గణేశుల బాబు జడల కళ్యాణ్ దుంపల వినోదు నల్లమల హరీష్ తదితరులు పాల్గొన్నారు