

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
లింగందాన గ్రామంలో పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట
పూజా కార్యక్రమంలో పాల్గొన నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు మే 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కేశంపేట మండలం లింగందాన గ్రామం పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మరియు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, లింగం దాన సర్పంచ్ నాగిలా వెంకటేష్ ఉపసర్పంచ్ లావణ్య తిరుపతి రెడ్డ,పోమాల్ పల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి, పోల్గంగుట్ట సర్పంచ్ భాస్కర్ నాయక్, లేమామిడి సర్పంచ్ సులోచన శ్రీనివాస్, సుందరపూర్ సర్పంచ్ భారతి రవి నాయక్, మహాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచులు శేఖర్ పంతులు, యారం శేఖర్ రెడ్డి, కృష్ణయ్య,సీనియర్ నాయకులు గోగు వెంకట్ నారాయణ్ రెడ్డి,మాజీ ఎంపిటిసి రాంచందర్, ఉపసర్పంచులు యారం రామ్ రెడ్డి,ప్రమోద్ రెడ్డి,మాజీ ఉపసర్పంచులు మన్మధ రెడ్డి,రామ్ రెడ్డి,బీఆర్ఎఎస్ నాయకులు భైర్కాన్ పల్లి సర్పంచ్ తనయుడు శివ యాదవ్,నాగ రాజు,పల్లాటి క్రిష్ణ,శేరి శ్రీనివాస్ రెడ్డి,మురళి తదితరులు పాల్గొన్నారు.