

పయనించే సూర్యుడు మే14 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక (99 రోజులు)లో భాగంగా 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు విద్యావారోత్సవాలు నిర్వహిస్తున్నందున ఈరోజు ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఉప్పర్ పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో బడిబాట ర్యాలీ మరియు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ మాసన్నోల్ల రవితేజ. మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యనుఅందిస్తుందని, విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తుందాన్నారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు మీ మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు రవీందర్. మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం తో పాటు ఇంగ్లీష్ మీడియం లో కూడా బోధించడం జరుగుతుందని, విద్యార్థులకు పుస్తకాలతో పాటు ముట్టు పుస్తకాలు కూడా అందించడం జరుగుతుందని కావున చిన్నారి విద్యార్థినీ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాల్సిందిగా కోరడం జరిగింది. కార్యక్రమంలో గ్రామస్థులు సాయిలు, యువరాజ్, శేఖర్, శ్యామ్,రాజు, నర్సమ్మ,సెక్రెటరీ సాయినాథ్, VAO విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పావని, జగదీష్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొనడం జరిగింది.