

ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
విఐఐటి జెఈఈ అకాడమీ,మరియు జూనియర్ కాలేజ్ ప్రారంభోత్సవం
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు
( పయనించే సూర్యుడు మే 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) విద్యార్థుల పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి,వారిలోని ప్రతిభను వెలికితీసి,నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు మరియు విస్తృత అవకాశాలు కల్పించడానికి షాద్ నగర్ పట్టణంలోని మహబూబ్నగర్ రోడ్ లో ఏర్పాటుచేసిన VIITJEE అకాడమీ,మరియు జూనియర్ కాలేజ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని యాజమాన్యాని కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే సరైన శిక్షణ అవసరమని అలాంటి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అకాడమీ యాజమాన్యం, షాద్ నగర్ పట్టణ కౌన్సిలర్లు బిఎస్ సుధీర్, గౌస్ జానీ,అనిత రఘునాథ్ యాదవ్, రిపోర్టర్ చందు, మాజీ జెడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ, మహాదేవపూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్,గోపాల్ నాయక్, శేరి శ్రీనివాస్ రెడ్డి,దినేష్ సాగర్,అల్లాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.