
పయనించే సూర్యుడు మే 15 ముమ్మిడివరం ప్రతినిధి. 2025_26 సంవత్సరంలో 10వ తరగతిలో 570 మార్కులు పైన వచ్చినవారు గూగుల్ పేపర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కేవలం ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కాగా, 590 నుండి 600 వరకు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ మరియు స్కాలర్షిప్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 580 నుండి 590 వరకు వచ్చిన వారికి సిల్వర్ మెడల్ సర్టిఫికెట్ స్కాలర్షిప్, అలాగే 570 నుండి 580 వరకు మార్కులు వచ్చిన వారందరికీ పతకాలూ సర్టిఫికెట్స్, స్కాలర్షిప్ కూడా ఇస్తున్నామని వివరించారు. వీరందరికీ ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్. వారి ఆధ్వర్యంలో విజయవాడలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు మరియు వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ వారి చేతుల మీదగా అందచేయనున్నట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కంకటాల రామం తెలిపారు. 10 వ తరగతి పరీక్షల్లో 570 మార్కులు పైగా సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేత. కింద ఇచ్చిన Google Form ద్వారా ఆర్యవైశ్య విద్యార్థులు నమోదు చేసుకోగలరు.