
విట్యాల గ్రామం లో ఘనంగా బడిబాట కార్యక్రమం
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం
(పయనించే సూర్యుడు మే 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుంచి 17 వరకు విద్య వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఫరూక్నగర్ మండలం విట్యాల గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ మరియు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పదవ తరగతి ఫలితాల్లో 400 మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ వెంకటయ్య పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఉచిత పుస్తకాలు మరియు మధ్యాహ్న భోజన పథకం డిజిటల్ క్లాస్ రూమ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కావున విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో విట్యాల సర్పంచ్ వెంకటయ్య ఉప సర్పంచ్ రమేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కల్పన మరియు మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ మరియు ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.
