
రమేష్ దంపతులకు 5 వేల ఆర్థిక సాయం
పాల్గొన్న పంచాయతీ సెక్రెటరీ వార్డు సభ్యులు చాట్ పట రవీందర్ మాజీ వార్డ్ సభ్యు లు చందులాల్
(పయనించే సూర్యుడు మే 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండాకు చెందిన రాత్లావత్ రమేష్ కోమిలి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు పూర్తయిన సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడియాల కుంట తండా సర్పంచ్ మూడవత్ రాజు నాయక్ చౌహాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతేకాకుండా రమేష్ దంపతులు ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని ధన మంచి మనసుతో రమేష్ దంపతులకు 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. దీంతో రమేశ్ దంపతులు సర్పంచ్ రాజు నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్ తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి జంగయ్య వార్డు సభ్యుడు చట్ పట్ రవీందర్ మరియు మాజీ వార్డు సభ్యులు చందులాల్, మూడవత్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
