
పయనించే సూర్యుడు మే 15/మక్తల్ : మాధ్వర్ గ్రామంలోగురువారం ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధి దారులైన బుడబోయి భీమమ్మ, మంగలి రేణుకమ్మ నూతన గృహాల గృహప్రవేశం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా వాకిటి శేషగిరి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణేష్ కుమార్ హాజరై నూతన గృహాలను ప్రారం భించారు. ఈ సందదర్భంగా ముఖ్యఅతిథులు మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞ తలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, ప్రతి అర్హుడికి ఇల్లు మంజూరు చేసే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర మండల నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్ల సత్యనారాయణ, బాట విశ్వనాథ్, వడ్ల నర్సింహ బుడే బోయి బాలు, బలిజ సిద్దు, గణపురం గోవర్ధన్, మంగలి నగేష్ తదితరులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులు బుడ బోయి భీమమ్మ, మంగలి రేణుకమ్మ మాట్లాడుతూ, తమ చిరకాల సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సహకరించిన నాయకులకు ధన్యవా దాలు తెలిపారు. గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.