

షాద్ నగర్ లో వీఐఐటీ జెఈఈ డాక్టర్స్ అకాడమీ నిర్వాహకులకు అభినందనలు తెలిపిన
బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు మే 16 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ ) షాద్ నగర్ పట్టణంలోని యమ్మీ బేకరీ వెనుకాల విఐఐటీ డాక్టర్స్ అకాడమి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ మారం శ్రీనివాస్, ఇతర డైరెక్టర్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందర్బంగా బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై యాజమాన్యానికి అభినందనలు తెలపడం జరిగింది.షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు తక్కువ పీజులో నాణ్యమైన బోధన అందించి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో తీర్చి దిద్దే బాధ్యత మీదే అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.నియోజకవర్గంలోని విద్యార్థులు సద్వినియోగపర్చుకోవాలని అన్నారు.యాజమాన్యం విష్ణువర్ధన్ రెడ్డి ని శాలువాతో సత్కరించి మేమెంటో అందించడం జరిగింది..