
పయనించే సూర్యుడు మే 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేను కోనమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల పల్లం (హాబిటేషన్) నందు ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా సెక్టోరల్ అధికారి కమ్యూనిటీ మొబిలైజేడ్ ఆఫీసర్ శ్రీ బివి సుబ్రహ్మణ్యం, కాట్రేనికోన మండల విద్యాశాఖాధికారులు శ్రీ నామాల కృష్ణ మోహన్ & ఎం. వెంకట రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, విద్యా కమిటీ సభ్యులు సభ్యులు, సీఆర్పీలు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, అంగన్వాడీ సిబ్బందితో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి, తల్లి దండ్రులతో మాట్లాడి విద్యార్థులను జాయిన్ చేసుకొనుట జరిగినది.
