
పయనించే సూర్యుడు 18 5 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్బాల్కొండ నియోజకవర్గంలోఈరోజు సోమవారం రోజున భీంగల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నూతనంగా నియమించబడిన భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మరియు పట్టణ అధ్యక్షుడు పర్స అనంతరావు గార్లను మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్ లు బాబాపూర్ సర్పంచ్ సమీర్, చెంగల్ గ్రామ సర్పంచ్ దూమల రాజు, గొణుగోపుల సర్పంచ్ చరణ్ గౌడ్, పురంపెట్ సర్పంచ్ దేవేందర్ గౌడ్ , బచ్చన్ పల్లి సర్పంచ్ జనార్ధన్, పెద్దమ్మకాడి తండా సర్పంచ్, బుక్య రమేష్ దేవక్క, పెట్ సర్పంచ్ అజయ్, ఎంజి తాండ సర్పంచ్ డేగవత్ గణేష్, సంతోష్ నగర్ తాండ సర్పంచ్ శివ నాయక్, సుదర్శన్ నగర్ తండా సర్పంచ్ వసుంధర నాయక్, తాళ్లపల్లి సర్పంచ్ రాజిరెడ్డి, రహత్ నగర్ సర్పంచ్ తిరుపతి,మున్సిపల్ కౌన్సిలర్ లు తోట సతీష్, సంగ్యా నాయక్, సందీప్, అంజుమ్, మరియు ఇతరులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు జీవన్,చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మరియు పట్టణ అధ్యక్షుడు పర్స అనంతరావు మాట్లాడుతూ తమను నియమించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి కి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తామని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు