
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ : ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నిజామాబాద్ నుండి వరంగల్ వరకు, అలాగే వరంగల్ నుండి నిజామాబాద్ వరకు మొత్తం 50 డీలక్స్ ట్రిప్పులను ప్రవేశపెట్టినట్లు నిజామాబాద్ రీజినల్ మేనేజర్ T. Joshna తెలిపారు.ఈ బస్సులు ఉదయం 3.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తాయని ఆమె వెల్లడించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు ఈ ప్రత్యేక షెడ్యూల్ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని సురక్షితంగా ప్రయాణించాలని ఆమె కోరారు.